సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మూవీ బృందం మొదటగా పూజ హెగ్డే ను శ్రీ లీల ను హీరోయిన్ లుగా ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరిలో పూజ హెగ్డే ను మెయిన్ హీరోయిన్ గా ఈ చిత్ర బృందం తీసుకోగా ... శ్రీ లీల ను రెండవ హీరోయిన్ గా ఈ మూవీ బృందం తీసుకుంది. వీరిద్దరిని హీరోయిన్ లుగా ఎంపిక చేసుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.
అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి పూజా హెగ్డే ను తీసివేయబోతుంది అంటూ ఒక వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఇలా ఈ వార్త అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ వార్తలను కొట్టి పారేయలేదు ... అలా అని ఈ వార్తలు అన్ని రూమర్స్ అని ప్రకటించలేదు. దానితో ఈ వార్తలు నిజమే అని అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... గుంటూరు కారం మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి పూజా హెగ్డే ను తీసుకువెయ్యనున్నట్లు అలాగే ఈ మూవీ లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అయినటువంటి మీనాక్షి చౌదరి ని తీసుకోబోతున్నట్లు ... అందుకు సంబంధించిన చర్చలను జరుపుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ గుంటూరు కారం మూవీ పై మాత్రం తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.