ఒకే స్టోరీ లైన్ తో వచ్చి హిట్స్ కొట్టిన తండ్రి కొడుకులు....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇక మహేష్ బాబు ఎంటైర్ కెరీర్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ` శ్రీమంతుడు ఒకటి.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. జి. మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.

2015 ఆగస్టు 7న విడుదలైన శ్రీమంతుడు చిత్రం ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో హీరో తండ్రి సొంత ఊరుపై కోపంతో వలసొచ్చి కోట్లు సంపాదిస్తాడు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్గా ఎదగుతాడు. సిటీలో పెరిగిన హీరో తన సొంత ఊరికి చెందిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన సొంత ఊరికి వెళ్తాడు.

సొంత ఊరును దత్తత తీసుకుని బాగుచేయడం ప్రారంభిస్తాడు. అలాగే అక్కడ ఎంపీ సోదరులు చేసే అక్రమాలను ఎదిరించి.. ఊరికి పట్టిన పీడను వదిలిస్తాడు. ఇదే శ్రీమంతుడు కథ. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇదే కథతో కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఓ మూవీ చేశాడు. అదే `రామరాజ్యంలో భీమరాజు`. ఎ. కోదండరామి రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు... ఇందులో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. అయితే ఈ మూవీ కథ కూడా ఇంచుమించు శ్రీమంతుడు మాదిరే ఉంటుంది. కోట్లకు వారసుడు అయిన హీరో.. విలన్లు బారిన నుంచి ఓ గ్రామాన్ని, అక్కడి ప్రజలను రక్షిస్తాడు. అదే ఊరికి చెందిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. 1983లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే రామరాజ్యంలో భీమరాజు సినిమాకు శ్రీమంతుడు కాపీ మాదిరి ఉంటుంది. ఏదేమైనా ఒకే కథతో వచ్చి తండ్రీకొడుకులిద్దరూ సూపర్ హిట్ కొట్టడం విశేషం.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ, మహేష్ బాబు కాంబో లో వచ్చిన మరో మూవీ భరత్ అనే నేను..ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: