అగమ్య గోచరంలో టాలీవుడ్ !

Seetha Sailaja
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకు 75 శాతం వరకు ధియేటర్స్ నుండి ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమాకు సంబంధించి నిర్మాత పెట్టిన పెట్టుబడిలో కేవలం 40 శాతం వరకు మాత్రమే ధియేటర్ల నుండి ఆదాయం వస్తోంది. మిగతా ఆదాయం అంతా శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ ఓటీటీ రైట్స్ నుండి నిర్మాతలకు ఆదాయం వస్తోంది.


దీనితో పెరిగిన ఈ ఆదాయం పై హీరోల దృష్టి పడటంతో హీరోలు అంతా అత్యంత భారీ స్థాయిలో తమ పారితోషికాలను పెంచడంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. దీనితో శాటిలైట్ ఓటీటీ ల ఆదాయం వస్తున్నప్పటికీ సక్సస్ ఫుల్ సినిమాలను తీస్తున్న నిర్మాతలకు కూడ ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలు కొనుక్కున్న బయ్యర్ల పరిస్థితి కూడ ఇండస్ట్రీలో ఏమాత్రం బాగాలేదు అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


ఈసంవత్సరం విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ అయిన ‘వాల్తేర్ వీరయ్య’ ‘దసరా’ సినిమాలకు సంబంధించిన కొందరు బయ్యర్లకు ఆసినిమాలు హిట్ అయినప్పటికీ కొన్ని ఏరియాలలో నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో కొందరు గుసగుసలు ఆడుకుంటున్నారు. క్రితం సంవత్సరం విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన కొందరు ఆంధ్రా బయ్యర్లకు కూడ ఇలాంటి పరిస్థితి ఎదురైందని అయితే వారు తమకు నష్టాలు వచ్చాయి అని చెప్పుకోలేకపోతున్నారు అంటూ మరికొన్ని గాసిప్ లు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే భారీ సినిమాలను కొనే బయ్యర్ల సంఖ్య బాగా తగ్గిపోయే ఆస్కారం ఉందని మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీ పరిస్థితులు పట్టించుకునే స్థితిలో హీరోలు లేరని వారు డేట్స్ ఇస్తే చాలు ఎంతటి భారీ పారితోషికం అయినా నిర్మాతలు ఇవ్వడానికి క్యూ కడుతున్న పరిస్థితులలో చాలామంది నిర్మాతలు భవిష్యత్ లో సినిమా నిర్మాణానికి దూరం అయి మరొక వ్యాపారం చేసుకోవచ్చు కదా అన్న ఆలోచనలోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటూ ఇండస్ట్రీలోని అగమ్యగోచర పరిస్థితుల పై కొందరు ఆవేదన వ్యక్త పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: