అదిపురుష్ ఫలితానికి రావణుడు కారకుడా ?

Seetha Sailaja
విడుదలైన మొదటిరోజు మొదటి షో నుండి భయంకరమైన నెగిటివ్ ట్రోలింగ్ ను తట్టుకుని ‘ఆదిపురుష్’ మొదటి మూడు రోజులకు 300 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసినప్పటికీ ఆసినిమా కలక్షన్స్ పై ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆనందంగా లేరు. ఈసినిమా బయ్యర్లు నష్టాలు రాకుండా బయట పడాలి అంటే మరో 200 కోట్ల కలక్షన్స్ వచ్చి తీరాలి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.


అయితే ఈమూవీకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన మొదటి సోమవారం పరీక్షలో కొంతవరకు పాస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈమూవీకి ఉత్తరాది ప్రాంతంలో కలక్షన్స్ బాగానే వస్తున్నాయి అని వస్తున్న వార్తలను బట్టి మొత్తం మీద ఈమూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


దీనితో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీకి ఈ రేంజ్ లో కలక్షన్స్ వస్తూ ఉంటే అంచనాలకు అనుగుణంగా ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈమూవీ ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాగా మారి ఉండేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ‘ఆదిపురుష్’ మూవీకి నెగిటివ్ టాక్ రావడానికి ప్రధానకారణం రావణ పాత్రను డిజైన్ చేసే విషయంలో చేసిన పొరపాట్లు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.




రావణాసురుడు లంక అత్యంత సుందరమైన బంగారు ప్రాంగణం అనీ పురాణాలలో వర్ణిస్తే ఓం రౌత్ మటుకు లంకను ఒక డెన్ గా మార్చి ఎందుకు చూపెట్టాడు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక శివ భక్తుడైన రాణాసురుడి నుదుట విభూది రేఖలు ఉండవలసిన స్థానంలో చిన్న ఎర్రటి తిలకం ఎందుకు పెట్టారు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలలో ప్రేక్షకుల అంచనాలను రావణాసురుడి పాత్ర అందుకోలేక పోవడంతో ‘ఆదిపురుష్’ మూవీ కలక్షన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి అన్న బాధ ప్రభాస్ అభిమానులలో విపరీతంగా కనిపిస్తోంది....


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: