ఎన్టీఆర్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి?
ఇలాంటి కోవలోకి చెందిన హీరోయిన్లలో కీర్తి చావ్లా కూడా ఒకరు అని చెప్పాలి. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది కీర్తి చావ్లా. వీవి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సినిమా పూర్తిగా క్యూట్ గా కనిపించి.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి చావ్లా. తారక్ తో ఈ అమ్మడి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది అని చెప్పాలి సాధారణంగా ఒక్క సక్సెస్ వచ్చిందంటే తర్వాత హీరోయిన్ వద్దకు అవకాశాలు క్యూ కడుతూ ఉంటాయి.
కానీ ఆది ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కీర్తిచావ్లాకి అంతగా అవకాశాలు రాలేదు. ఆది సినిమా తర్వాత మన్మధుడు సినిమాలో ఒక పాటలో కనిపించింది. ఆ తర్వాత కాశి, శ్రావణమాసం, ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు సినిమాల్లో కనిపించింది. ఎన్ని సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు మాత్రం రాలేదు. తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. దాదాపు 10 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న కీర్తి.. ఇటీవల అమ్మాయి ప్రేమ కథ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. అయితే ఇటీవల కీర్తి చావ్లాకు సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ వీడియోలో కీర్తిని చూసి అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. షాక్ అవుతున్నారు.