ఆదిపురుష్: బాహుబలి వైబ్స్ తిరిగి తెచ్చిన రెబల్ స్టార్?

Purushottham Vinay
ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా కూడా ఆది పురుష్ పేరు మారుమోగుతోంది. ప్రభాస్‌ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7వేలకి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ మూవీ. ఇప్పటి దాకా ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం పక్కా అని సినీ క్రిటిక్స్‌ కూడా అభిప్రాయపడుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విజువల్స్‌కి ప్రేక్షకులు చాలా ఫిదా అవుతున్నారు.ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఆదిపురుష్‌ సినిమా పలు రికార్డులను తిరగరాసింది. అత్యధిక థియేటర్లలో విడుదలై అరుదైన రికార్డును సాధించుకున్న ఈ మూవీ ఇప్పుడు మరో గుర్తింపును సంపాదించుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత అరుదైన గౌరవాన్ని దక్కించుకుని సినిమాగా ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది.



ప్రముఖ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్ పోర్టల్‌ 'బుక్‌ మై షో'లో ఈ రికార్డును ఈ సినిమా దక్కించుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 10లక్షలమంది ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ యాప్‌లో ఇప్పటి దాకా 1.75 మిలియన్‌ ఇంట్రెస్టులతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు 1 మిలియన్‌ లైక్స్‌తో 'ఆదిపురుష్‌' సినిమా రెండో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే టికెట్ల విషయంలో కూడా ఆదిపురుష్‌ మూవీ పాత రికార్డులను బద్దలు కొట్టింది. సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌లో కూడా మార్నింగ్ నుంచి పాజిటివ్ టాక్ తో ఆదిపురుష్‌ ఓపెనింగ్స్‌లో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియా వేదికగా కూడా ఆదిపురుష్‌కి సెలబ్రిటీల నుంచి గట్టి సపోర్ట్ లభిస్తోంది. ఇదే ఊపు ఒక వారం కొనసాగితే దాదాపు అన్ని పెద్ద సినిమాల రికార్డులు ఈజీగా బద్దలు అయిపోవడం ఖాయం. చూడాలి ఆది పురుష్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. మొత్తానికి ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో బాహుబలి టైం లో వున్న వైబ్స్ ని తీసుకోచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: