'ఆదిపురుష్' మూవీ సోషల్ మీడియా రివ్యూ అప్డేట్...!!

murali krishna
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఏమంటున్నారో సోషల్ మీడియా రివ్యూ చూడండి.గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తొలిసారిగా భక్తి ప్రధాన చిత్రంలో నటించారు. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులే కాదు, రాముడే హీరోగా భావించే యావత్ హిందూ ప్రపంచం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందుకే ఈ సినిమాపై విపరీతమైన భజ్ ఏర్పడింది. ఇన్ ఫ్యాక్ట్ ప్రభాస్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాహుబలి తర్వాత మళ్ళీ హిట్ చూడలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ తర్వాత వచ్చే సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని అందరికీ నమ్మకం ఉంది. కానీ రెండు వరుస ప్లాప్ ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుంచి ఆదిపురుష్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
అయితే ఆదిపురుష్ ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లు చూసి కొంత మంది విమర్శలు చేశారు. గ్రాఫిక్స్ బాలేదని, ప్రభాస్ గెటప్ బాలేదని, సినిమా ఆడదని రకరకాల కామెంట్స్ చేశారు. ఎట్టకేలకు ఈ విమర్శలను దాటుకుని సినిమా విడుదలైంది. మరి టాక్ ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు? సోషల్ మీడియా రివ్యూలో చూద్దాం. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు.సోషల్ మీడియా లో ఆదిపురుష్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉందని చెబుతున్నారు. హనుమాన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని, సంగీతం, పాటలు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ బాలేదని, సెకండాఫ్ లో ఎమోషనల్ కనెక్షన్ అంతగా లేదని అంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ మూవీ అని, చూడవచ్చునని ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది, గూస్ బంప్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇది సులువుగా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ హిట్ కొట్టేశారు అంటూ ఒక యూజర్ రివ్యూ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని, విజువల్స్, గ్రాఫిక్స్, ఫైట్ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయని, ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ల పాత్రలు అద్భుతం అంటూ మరొక యూజర్ రివ్యూ ఇచ్చారు.

ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండాఫ్ ఫ్లాట్ గా నడుస్తుందని, ఫస్ట్ హాఫ్ లో డ్రామా ఆకట్టుకుంది కానీ సెకండ్ హాఫ్ లో పేలవమైన వీఎఫ్ఎక్స్ తో సుదీర్ఘమైన ఫైట్ సన్నివేశాలు తప్ప ఏమీ లేవని, సినిమాకి సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అని.. ఒకసారి చూడవచ్చునని మరొక యూజర్ వెల్లడించారు. మొదటి భాగం రామాయణం కథను పూర్తిగా భిన్న రీతిలో చూపించారు. లంక సన్నివేశాలు మినహాయిస్తే మొదటి భాగం చాలా బాగుంది. రోమాలు నిక్కబొడుచుకుని సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాలి, సుగ్రీవుల ఫైట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే ఫైర్ ఉంటుంది. రెండవ భాగం చాలా తక్కువగా ఉంది. డ్రామా, కథనం చాలా ఫ్లాట్ గా ఉన్నాయి. దర్శకుడు చేసిన ప్రయోగానికి అభినందనలు చెప్పవచ్చు. యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ సినిమా. 2.75/5 రేటింగ్ ఇస్తూ మరొక యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే కొంతమంది మాత్రం సినిమా బాలేదని చెబుతున్నారు. కానీ ప్రభాస్ యూఎస్ఏ ఫ్యాన్స్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అని, ప్రభాస్ హిట్ కొట్టేశారని, నెగిటివ్ రివ్యూస్ ని నమ్మొద్దని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: