ఇంకా అన్ని రోజులు మిగిలి ఉన్న "గుంటూరు కారం" మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో అదే విధంగా ఈ సినిమాలో సెంటిమెంట్ సన్నివేషాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ లో చాలా యాక్షన్స్ సీన్స్ ను ఈ మూవీ బృందం తెరకెక్కించగా ... అలాగే చాలా ఎమోషన్స్ సన్నివేశాలను కూడా ఈ మూవీ బృందం చిత్రీకరించినట్లు తెలుస్తోంది.


ఈ రెండింటిని కూడా ఇప్పటి వరకు మూవీ యూనిట్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తనికెక్కించినట్లు ... ఈ సన్నివేశాలు కూడా హైలెట్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పూజ హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది.


అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇంకో 78 రోజుల వర్కింగ్ డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ డేస్ ను 78 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా ఈ మూవీ మేకర్స్ ప్లానింగ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: