బ్రో మూవీలో షాకింగ్ సీన్ !
పవన్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఊర్వశీ రౌతేలా తో చేసిన ఐటమ్ సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ పై ఒక ఫైట్ సీన్ ను కూడ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ చేసే ఫైట్ చాల డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటుందని ఈ ఫైట్ సీన్ ఈమూవీ ఇంట్రవెల్ ముందు వస్తుందని టాక్. ఈ మూవీలో వచ్చే ఈ రెండు సీన్స్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చుతాయి అని అంటున్నారు.
ఈమూవీకి సంభాషణలు వ్రాసిన త్రివిక్రమ్ మనిషిని ప్రభావితం చేసే కనిపించని అదృష్టం గురించి అదేవిధంగా దైవశక్తి గురించి సగటు ప్రేక్షకుడికి కూడ అర్థం అయ్యేలా తన పెన్ పవర్ త్రివిక్రమ్ చూపించాడు అని అంటున్నారు. తమిళ సినిమా ‘వినోదయ సిత్తంకు’ ఈ రీమేక్ విషయంలో అనేక మార్పులయి జరిగాయి అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈమార్పులు చేశారు అని అంటున్నారు.
సాధారణంగా టాప్ హీరోల సినిమాలు పండుగ సీజన్ లో కానీ లేదంటే సమ్మర్ సీజన్ లో కాని విడుదల చేస్తూ ఉంటారు. అయితే వర్షాలు ఎక్కువగా వచ్చే జూలై నెలలో ఈమూవీ రావడం ఒకవిధంగా సాహసం. అంటున్నారు. హీరోయిన్ పాత్ర లేకుండ ఈమూవీలో పవన్ నటిస్తున్నాడు. కేవలం వలయం అతడి మ్యానియాను నమ్ముకుని ఈమూవీని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు..