తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్య సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు సుకుమార్. మొదటి సినిమాతోనే డైరెక్టర్గా తన సత్తా ఏంటో చాటాడు. ఇక ఆర్య సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమాని ఎవరు మర్చిపోలేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక లాజిక్ పట్టుకొని క్యాలిక్యులేషన్తో ముందుకు తీసుకుపోతాడు సుకుమార్. ఇక ఆ లాజిక్ నే కనిపెట్టడం ఆ లాజిక్ ని ఎంజాయ్ చేయడమే ప్రేక్షకుడికి ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే హాయిగా బ్రతుకుతాడు. ఒక సామాన్యమైన మనిషిలా ఉంటాడు సుకుమార్. అయితే ఇటీవల ఆయన భార్య వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య షేర్ చేసిన ఆ పోస్టుని చూసిన వారందరూ లెక్కలు మాస్టర్ కి సరైన భార్య అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరైనా సరే పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటే ఏదో ఒక మంచి కోట్ ని పెట్టి వారికి శుభాకాంక్షలు తెలుపుతారు.
కానీ సుకుమార్ భార్య తబిత మాత్రం చాలా డిఫరెంట్ గా ఒక పోస్ట్ ని పెట్టింది. 14 సంవత్సరాల కవిత సుకుమార్ వైవాహిక జీవితం ఈక్వల్ టు 730 వారాల ఆనందం 5,13 రోజుల విధేయత 1,22,721 గంటల అవగాహన 7363288 పట్టుదల 441797328 సెకండ్ల నిరంతర నిబద్ధత అంటూ చెప్పుకొచ్చింది తబిత. ఇక 14 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఈమె చాలా సింపుల్ గా ఈ విధంగా వెల్లడిస్తూ తమ పెళ్లిరోజు శుభాకాంక్షలు అని తెలిపింది ఈమె. లెక్కల మాస్టర్ సుకుమార్ కి సరైన లెక్కలతో లాజికల్ బ్రెయిన్ కి సరైన లాజిక్ తో ఒక మంచి బ్రెయిన్ తో సుకుమార్ వైవాహిక జీవితాన్ని సుకుమారికి లెక్కలేసి మరి మొత్తం పబ్లిక్ గా అందరికీ తెలియజేసేలా చెప్పింది తబిత. నిజంగా తబితకి సుకుమార్ మీద ఉన్న అభిమానం గౌరవం ప్రేమ ఎలా ఉన్నాయో ఈ ఒక్క పోస్ట్ ని చూస్తే అర్థమవుతుంది ..!!