టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గోపీచంద్ కెరియర్లో హిట్ సినిమా కొట్టి చాలా కాలం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.సినిమా విడుదలై బావుంది అని టాక్ వచ్చిన వెంటనే ఫ్లాప్ గా నిరుస్తుంది. దానికి కారణం గోపీచంద్ సినిమాలకు అంతగా హైప్ లేకపోవడమే. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది వారికి ఉన్న ఇమేజ్ ని పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చేయడానికి రెడీ అవుతున్నారు.
కళ్యాణ్ రామ్ కూడా బింబిసార వంటి సబ్జెక్టును తనే నిర్మించి మరి తన మార్కెట్ను బాగా పెంచుకున్నాడు ఇక ఆ సినిమాలో కళ్యాణ్రామ్ పాత్ర ఎంత చాలెంజింగ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ పాత్ర కూడా దాదాపు అదే తరహాలో ఉంటుంది. ఇక ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు నిఖిల్ .ఇద్దరు యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కూడా ఇలాగే ఛాలెంజ్ పాత్రలను ఎంచుకుంటూ హిట్టులను కొడుతున్నారు. కానీ గోపీచంద్ మాత్రం ఇంకా పాత కథలతోనే సినిమాలు చేస్తున్నాడు.
దీంతో గోపీచంద్ అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన రామబాణం సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా ఉందో. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. ఆ సినిమా పేరు భీమ. కన్నడలో పలు హిట్లు అందించిన దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇటీవల ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తానని ఎప్పుడో చెప్పాడు గోపీచంద్ .అయితే ఇటీవల రావడం సినిమా ఫలితం కారణంగా తన మనసు మార్చుకున్నాడట గోపీచంద్. ప్రస్తుతం ఆయన చేస్తున్న బీమా సినిమా ఫలితాన్ని బట్టి ఈ సినిమా చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటాడట..!!