ఏజెంట్ నష్టాలను భుజానికి ఎత్తుకున్న భోళా శంకర్ !

Seetha Sailaja
యంగ్ హీరో అఖిల్ కెరియర్ లో ఇప్పటివరకు నటించిన ఐదు సినిమాలలో నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఒకే ఒక్క సినిమా ఏవరేజ్ హిట్ గా నిలిచింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ మరొక యంగ్ హీరోకు ఉండి ఉంటే ఇప్పటికే అతడి పేరును ఇండస్ట్రీ వర్గాలు మరిచిపోయి ఉండేవి. అయితే అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అతడిని కాపాడుతోంది.


లేటెస్ట్ గా విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారిన ‘ఏజెంట్’ మూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ బిజినెస్ భారీ స్థాయిలో అఖిల్ రేంజ్ కి మించి జరిగింది. బాక్స్ ఆఫీసు దగ్గర మ్యాజిక్ చేస్తుంది అని భావించిన ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో ‘ఏజెంట్’ ను కొన్న బయ్యర్లకు విపరీతమైన నష్టాలు రావడంతో ఈ మూవీ నిర్మాతల పై ఒత్తిడి పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిర్మాతలకు కూడ ఎంతోకొంత సెటిల్ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో ఈ సినిమా నిర్మాతలకు ఈ మూవీ బయ్యర్లకు మధ్య సెటిల్మెంట్ చర్చలు జరుగుతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థ తీస్తున్న ‘భోళా శంకర్’ మూవీ రైట్స్ ను కొంచం తక్కువ రేటుకు ‘ఏజెంట్’ బయ్యర్లకు ఇచ్చి ఆ నష్టాన్ని పూడ్చుకునే విధంగా రాజీ చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి.

గతంలో ఇలాంటి ఫార్మలాను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తన సినిమాల విషయంలో అనుసరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఫార్మలాను ‘ఏజెంట్’ నిర్మాతలు అనుసరిస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి ‘భోళా శంకర్’ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ఫ్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఏజెంట్’ బయ్యర్లకు కష్టాలు తీరే మార్గాన్ని ‘భోళా శంకర్’ సూచించినట్లు అయింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: