ఆహా కోసం చేతులు కలిపిన బన్నీ త్రివిక్రమ్ !
ఆహా మొదలైన దగ్గర నుండి ఆ ఓటీటీ చందాదారుల సంఖ్య ఊహించిన స్థాయిలో వేగంగా పెరగకపోవడం అల్లు కాంపౌండ్ కు సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ డిష్ హాట్ స్టార్ ఓటీటీ ల చందాదారుల సభ్యత్వ మొత్తంతో పోల్చుకుంటే ఆహా సభ్యత్వ మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రముఖ ఓటీటీ సభ్యత్వాల సంఖ్యతో పోల్చుకుంటే ఆహా సభ్యత్వాల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది అన్న కామెంట్స్ ఉన్నాయి.
దీనికితోడు భారీ సినిమాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేసే విషయంలో మిగతా ప్రముఖ ఓటీటీ సంస్థల పోటీకి ఇంకా పూర్తిగా ఆహా నిలదొక్కుకోలేకపోతోంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. దీనితో ఆహా రేంజ్ ని పెంచడానికి త్రివిక్రమ్ అల్లు అర్జున్ లు చేతులు కలిపారు. ‘గేట్ రెడీ ఫర్ ఎంటర్ టైన్మెంట్ సునామి’ అంటూ అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు ఒక షూటింగ్ స్పాట్ లో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ ఫోటో క్షణాలలో వైరల్ గా మారింది.
మరికొందరైతే ఈ ఫోటోను చూసి ఎంటర్ టైన్మెంట్ సునామి ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు వీరిద్దరు కలిసి ఆహా కోసం ఒక వెన్ సిరీస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆహా కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న అల్లు అర్జున్ ఈ వెబ్ సిరీస్ తో తన ఇమేజ్ మరింత పెంచుకునే ఆస్కారం ఉంది..