రూట్ మార్చిన బిగ్ బాస్ బ్యూటీ.. అందుకేనా..?

Divya
బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ సీజన్ సిక్స్ ద్వారా భారీ ఫేమస్ అందుకున్న ఈమె వర్మ తో కలిసి ఒక ప్రైవేట్ పార్టీలో డాన్స్ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకుంది. అప్పట్లో ట్రెండింగ్ లో కూడా మారింది. ఇకపోతే బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అక్కడ తన మాటలతో టాస్క్ లో ఒంటరి పోరాటంతో తెగింపు ధైర్యం చూపించి ఎవరికి భయపడనని నిరూపించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే భారీగా ఫ్యాన్ బేస్  ను కూడా సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక పలు సినిమా అవకాశాలు కూడా పొందింది.

ఇకపోతే తాజాగా ఏవం జగత్,  బుజ్జి ఇలా రా,  నటరత్నాలు ,క్రాంతి వంటి సినిమాలలో నటించిన ఇనయాకి  పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆమె ఆఫర్ల కోసం ఇలా బోల్డ్ ఫోటోషూట్లు చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే తాను మాత్రం నేను ఎవరి మాటలు వినను.. నాకు నచ్చిందే చేస్తాను నచ్చినట్టే ఉంటాను అంటూ ప్రతిసారి చెప్పుకోస్తోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఇనయా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టింది. అంతేకాదు అందులో రెగ్యులర్గా వీడియోలు చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తున్న ఈమే ఎప్పుడు బోల్డ్ అండ్ హాట్ కంటెంట్తో కనిపిస్తూ ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటుంది.

మొన్నటిదాకా ఊటీ కెళ్ళి అందాలు ఆరబోసిన ఈమె ఇప్పుడు తాజాగా మరొక బోల్డ్ లుక్ తో ఇంస్టాగ్రామ్ లో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. రకరకాల హాట్ ఫోటోలను షేర్ చేసి మరింత రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇకపోతే సినిమాలలో అవకాశాల కోసమే ఇలా గ్లామర్ డోస్ పెంచేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: