సినిమా ఇండస్ట్రీలో మామూలు రోజుల కంటే కూడా ఏదైనా ప్రత్యేక సందర్భం ఉన్న సమయాలలో ఎక్కువ శాతం సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ప్రత్యేక సందర్భం ఉన్నట్లు అయితే చాలా మందికి హాలిడేస్ ఉండడం ... అలాగే కుటుంబం అంతా ఒక చోట కలవడంతో సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. అలాంటి సమయంలో సినిమాలకు మంచి కలెక్షన్ లు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే కొంత మంది హీరోలు ఎక్కువ శాతం స్పెషల్ డేస్ ఉన్న సమయం లోనే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంచి సీజన్ లను చూసుకొని సినిమాలను విడుదల చేస్తున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు.
ఈయన ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేర్ వీరయ్య అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇలా ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదల అయిన వాల్టేరు వీరయ్య మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత ఈ సంవత్సరం సమ్మర్ లో రావణాసుర అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ దక్కలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం దసరా పండగ సందర్భంగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల కాబోతోంది.
ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ ... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇలా రవితేజ మంచి సీజన్ చూస్తూ సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నాడు.