ఆదిపురుష్: తెలుగు రాష్ట్రల్లో ఇంకా నో బుకింగ్స్..?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆది పురుష్'. ఇక ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సినిమా అడ్వాన్స్డ్ బుకింగ్స్ అన్నిచోట్ల ఓపెన్ అవ్వగా.. తెలుగులో మాత్రం బాగా లేటుగా అవుతున్నాయి. సినిమా రిలీజ్ కి కనీసం నాలుగు రోజులు కూడా లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు అడ్వాన్స్డ్ బుకింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ మూవీ మేకర్స్ టికెట్ హైక్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం వినిపిస్తోంది. నైజాంలో అయితే గరిష్టంగా రూ.295 దాకా టికెట్ రేట్ ని పెంచుకునేందుకు అవకాశం ఉంది.



అదే ఆంధ్రాలో అయితే రూ. 177 దాకా టికెట్ రేటుని పెంచుకోవచ్చు. ఇక ఇటీవల వచ్చిన పెద్ద సినిమాల నిర్మాతలు కూడా ఇలాగే రేట్లు పెంచుకున్నారు. 'ఆది పురుష్' భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నారట. టికెట్ పై మరో రూ.50 పెంచుకునేందుకు అనుమతి కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన నైజాం ఏరియాలో టికెట్ ధర రూ 345 ఇంకా ఆంధ్రాలో రూ. 237 అవుతుంది. పైగా ఇది 3D సినిమా కాబట్టి.. ఆ కాస్ట్ కూడా కలిపితే నైజాం ఏరియాలో రూ.370 ఆంధ్రాలో రూ.260 వరకు టికెట్ రేట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. సినిమా బడ్జెట్ పరంగా నిర్మాతల ఆలోచన సబబుగానే ఉన్నా.. ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: