పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా 'ఓజి' సినిమా కోసమే ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఒకే ఒక ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. అందుకే సినిమాపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుకుంటున్నారు. అప్పుడెప్పుడో 'పంజా' సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనిపించాడు పవర్ స్టార్.
మళ్లీ పుష్కరకాలం తర్వాత గ్యాంగ్స్టర్ పాత్ర చేస్తుండడంతో ఇండస్ట్రీలోనూ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నారట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే సుజిత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రోని చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇలాంటి ఇంట్రో లేదని అంటున్నారు. ఇప్పటికే దానిపై కసరత్తులు కూడా స్టార్ట్ చేసేసాడట సుజిత్. అభిమానుల అంచనాలను మించేలా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా 'ఆర్ ఆర్ ఆర్' తో భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్న డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఖైదీ మూవీ ఫేమ్ అర్జున్ దాస్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 60 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడట. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!