"బ్రో" మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చిన సముద్రఖని..!

Pulgam Srinivas
నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సముద్ర ఖని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సముద్ర కని ఇప్పటికే తన కెరీర్ లో కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. అలా సముద్ర కని దర్శకత్వం వహించిన సినిమాలలో వినోదయ సీతం అనే సినిమా ఒకటి.


ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.  ఇలా వినోదయ సీతం సినిమా మంచి విజయం సాధించడంతో ఇదే సినిమాను తెలుగు లో "బ్రో" అనే పేరుతో పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర కని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా బ్రో మూవీ గురించి సముద్ర ఖని అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పకచాడు. తాజాగా సముద్ర కని "బ్రో" మూవీ గురించి మాట్లాడుతూ ... ప్రస్తుతం బ్రో మూవీ కి సంబంధించిన టీజర్ పనులు జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే టీజర్ ను ఏ తేదీన విడుదల చేస్తాము అనే దానిని గురించి ఒక అప్డేట్ ఇస్తాం.


అలాగే బ్రో మూవీ కి సంబంధించిన ఫస్టాఫ్ డబ్బింగ్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన సెకండాఫ్ డబ్బింగ్ పనులు ఫుల్ స్పీడ్ గ జరుగుతున్నాయి అని సముద్ర కని బ్రో మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: