"విరూపాక్ష" మూవీకి ఏకంగా అన్ని కోట్ల లాభాలు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ మూవీ లో హీరోcగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ నైజాం ఏరియాలో 16.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 5.72 కోట్లు , యు ఏ లో 5.40 కోట్లు , ఈస్ట్ లో 2.71 కోట్లు , వెస్ట్ లో 1.97 కోట్లు , గుంటూరు లో 2.62 కోట్లు , కృష్ణ లో 2.62 కోట్లు , నెల్లూరు లో 1.32 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.81 కోట్ల షేర్ ... 68.60 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 2.95 కోట్లు , ఓవర్ సీస్ లో 5.86 కోట్లు , ఇతర భాషలలో 58 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 48.20 కోట్ల షేర్ ... 90.85 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 23 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా 25.20 కోట్ల ప్రాఫిట్ ను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: