వారికోసం భిక్షాటన చేస్తున్న ఫైట్ మాస్టర్స్...!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో నిత్యం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉండే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫైట్ మాస్టర్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరూ తమ షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన సొంత జిల్లాలో వాలిపోయి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ తమ సొంత జిల్లాలో పర్యటన చేయడమే కాకుండా ఏకంగా భిక్షాటన కోసం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో కోటయ్య వృద్ధాశ్రమానికి తరచూ రామ్ లక్ష్మణ్ వస్తూ ఉంటారు.
ఇలా తరచూ ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడమే కాకుండా వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకోవడం చేస్తుంటారు. అలాగే వృద్ధాశ్రమాని కి తమ వంతు సహాయంగా డబ్బును విరాళంగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త వినూత్నం గా ఆలోచించి ఈ మంచి పనిలో అందరిని భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశం తో వీరిద్దరూ చీరాల పట్టణంలోని పలు ప్రాంతాలలో జోలి పట్టి భిక్షాటన చేశారు. ఇలా వృద్ధాశ్రమం కోసం వీరిద్దరూ జోలి పట్టి భిక్షాటన చేయడం తో ఎంతోమంది ఈ భిక్షాటనలో భాగస్వామ్యం అయ్యారు. ఈ విధంగా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బును వృద్ధాశ్రమానికి ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం కోసం ఇచ్చారు. ఆ డబ్బుతో పాటు వీరిద్దరూ తమ డబ్బును కూడా కాస్త వేసుకొని వృద్ధాశ్రమానికి అందించారు అనంతరం అక్కడ వృద్ధులతో మాట్లాడి వారందరికీ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీరు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అంటారు.ఈ సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే సమాజంలో కూడా మార్పు వస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అయితే వృద్ధుల కోసం వీరిద్దరు చేసిన ఈ పనిపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: