మహేష్ సినిమాలో శ్రీ లీల పాత్ర ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
తాజాగా మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక ఏ సినిమాకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వల్ల రావడం జరిగింది.ఇక ఈ సినిమాకి గుంటూరు కారం అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ మరియు వీడియోని కూడా విడుదల చేశారు.   వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మొదట ఈ సినిమాలో పూజా హెగ్డేని మాత్రమే హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.దాని అనంతరం కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు.

 సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని అయినా సరే సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఈ క్రమంలోని గుంటూరు కారం సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు అన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీ లీలకి ఈ సినిమాలోని పాత్రలో ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఇక శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని అందరు కామెంట్స్ పెడుతున్నారు.

అయితే దానికి కారణం శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేయాలి అన్న ఉద్దేశంతో చిన్న పాత్రలో కూడా నటించడానికి సిద్ధమవుతోందట. ఇక ఈమె నటించిన మొదటి సినిమా పెళ్లి సందడి ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయినా కూడా టైం కలిసి వచ్చింది కాబట్టి ఈమెకి స్టార్ హీరోలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక అలాంటి సమయంలో ఈమె మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలపరంగా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కానీ ఈమె మాత్రం అలా కాకుండా చిన్న క్యారెక్టర్ లో సైతం నటించడానికి ఒప్పుకోవడంతో ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమె అభిమానులు చెప్తున్నారు. ఇక ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా మరియు బాలకృష్ణ సినిమాలో బాలయ్య కూతురుగా నటించడం వల్ల ఈమె కెరీర్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: