బాలయ్య భగవంత్ కేసరి టీజర్ ఎప్పుడంటే..!?

Anilkumar
నందమూరి నటసింహ బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి భగవత్ కేసరి అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు చిత్ర బంధం. ఐ డోంట్ కేర్ అనేది ఈ సినిమా టాగ్ లైన్. ఇక ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సీతయ్యలా ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి.దీంతో బాలయ్య తో పాటు ఆయన ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు .దానికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గతంలో ఒక హిట్టు కొడితే నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకునే బాలకృష్ణ ఇప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఇక అఖండ ఎలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఆయన నటించిన అఖండ సినిమాతో 75 కోట్లకు పైగా అనే షేర్ని వసూలు చేసిన బాలయ్య మొన్న వీర సింహారెడ్డి తో దాదాపుగా 77 కోట్లను వసూలు చేశారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఊహించని స్థాయిలో షేర్లను వసూలు చేయడంతో ఇప్పుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి.

 తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ వినూత్నంగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక టైటిల్ అనౌన్స్మెంట్కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 చోట్ల టైటిల్ హోల్డింగ్ సైతం పెట్టించారు దర్శక నిర్మాతలు. దానికి ముఖ్య కారణం బాలయ్యకు ఇది 108వ సినిమా కావడమే. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్య కి కూతురుగా కనిపించబోతోంది. అయితే జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. దర్శక నిర్మాతలు ఆరోజు హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఉదయం 10: 11 నిమిషాలకి దీనికి ముహూర్తం కూడా ఖరారు చేశారట .సరిగా అదే సమయానికి ఫ్యాన్స్ చేతిలో మీదుగా భగవత్ కేసరి విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: