NBK 108 టైటిల్ లాంచింగ్.. ఎప్పుడంటే..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్య సినీ కెరియర్ లో ఈ సినిమా 108 సినిమాగా రాబోతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. అయితే ఈ సినిమాలో బాలయ్య ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించి అందరి కి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. 

అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు నందమూరి ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను చాలావరకు ప్రారంభించేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర బృందం .అయితే బాలకృష్ణ 108వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా టైటిల్ను రేపు లాంచ్ చేయబోతున్నట్లుగా కాసేపటి క్రితమే అనౌన్స్ చేశారు చిత్రబృందం. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా టైటిల్ నువ్వు ప్రకటించబోతున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 108 హోల్డింగ్స్ పై ఈ టైటిల్ చేస్తారని ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలోని టైటిల్ విషయంలో చాలా రకాల పేర్లు కూడా వినబడ్డాయి. అయితే ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం వినబడుతుంది. సాధారణంగా బాలయ్య నటించిన సినిమాలకు సింహ అనే పేరు వచ్చేలాగా పెట్టడానికే అందరూ దర్శక నిర్మాతలు ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి భగవత్ కేసరి అన్న టైటిల్ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు నెక్స్ట్ సినిమా గురించి కూడా ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: