ఊర్వశి మ్యానియాలో టాలీవుడ్ !

Seetha Sailaja

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఆమె ముంబాయిలో అత్యంత విలాశవంతమైన జుహు ప్రాంతంలో 190 కోట్ల విలువ చేసే విల్లా కొనుక్కోవడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈమెకు ఇంత ఖరీదైన ఈ ఇంటిని ఒక పారిశ్రామిక వేత్త కొడుకు బహుమతిగా ఇచ్చాడు అంటు బాలీవుడ్ లో గాసిప్పులు కూడ వచ్చాయి.

‘వాల్తేర్ వీరయ్య’ మూవీలో ఈమె చిరంజీవితో కలిసి చేసిన ‘బాస్ వేరీజ్ ద పార్టీ’ చేసిన ఐటమ్ సాంగ్ తో ఈమె మ్యానియా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిపోయింది. ఈమె క్రేజ్ ను గ్రహించిన బోయపాటి శ్రీను రామ్ తో తీస్తున్న మూవీలో ఈమెకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చి ఐటమ్ సాంగ్ చేయించాడని వార్తలు కూడ వచ్చాయి.

ఇది చాలదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీలో ఈమె వీరిద్దరితో కలిసి ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఈమూవీ నిర్మాతలు హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను కూడ వేయించినట్లు తెలుస్తోంది. ఈమె మ్యానియా ఈ స్థాయిలో పెరిగిపోవడంతో చాలామంది టాప్ హీరోలు తమ సినిమాలలో చేయబోయే ఐటమ్ సాంగ్స్ విషయంలో ఊర్వశి ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


10 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన ఊర్వశి కెరియర్ లో బాలీవుడ్ లో ఆమె నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ ‘కాబిల్’ ‘పాగల్’ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ గా ఆమె కెరియర్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ 2018లో అండమాన్ నికోబర్ ప్రభుత్వం ఆమెను మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ గా సత్కరించింది. 2020 అరబ్ ఫ్యాషన్ కౌన్సిల్ నిర్వహించిన షోలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది చాలదు అన్నట్లుగా మొరాకో గవర్నమెంట్ ఆమెను ఐకాన్ గౌరవంతో ఆమెను సత్కరించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: