మంచు బ్రదర్స్ గొడవలపై క్రారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది మంచు లక్ష్మి. కూతురే కాకుండా తన ఇద్ద రు కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే ఇక గత కొద్ది రోజులుగా మంచు కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అప్పటికే వివాహం జరిగిన ఒక కొడుకు ఉన్న భూమ నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోవడంతో మంచు కుటుంబంలో తరచూ జరుగుతున్న గొడవలు బయటకు వచ్చాయి. మనోజ్ కి సైతం పెళ్లి అయ్యి ఆమెతో విడాకులు తీసుకున్న సంగతి చాలా మందికి తెలుసు.

ఇక మనోజ్ మరియు మౌనిక రెడ్డి ఇద్దరు ఎన్నో సంవత్సరాలు ఒకరినొకరు ఇష్టపడి కుటుంబాలను ఒప్పించి ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు మౌనిక తన కొడుకును కూడా తనతో అత్తగారింటికి తీసుకువచ్చింది. తన కొడుకును మనోజ్ తన కొడుకులా చూసుకుంటానని చెప్పడంతో మౌనిక తన కొడుకుని కూడా అత్తగారింటికి తెచ్చుకుంది. ఆ కారణం వల్లే మనోజ్ పెళ్లికి అన్న విష్ణు వచ్చినప్పటికీ చుట్టం చూపు లాగా వచ్చి వెళ్లిపోయాడు అంటూ పెళ్లి సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. మరోవైపు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం మంచు కుటుంబానికి ఇష్టం లేదన్న వార్తలు సైతం వినపడ్డాయి.

అయినప్పటికీ మనోజ్ కోసం ఈ పెళ్లి నేను మోహన్ బాబు దంపతులు ఇష్టంగా జరిపించారు. కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ వార్తలపై స్పందించింది మంచు లక్ష్మి .మనోజ్ పెళ్లి విష్ణుకు నిజంగానే ఇష్టం లేదా అని ఆమెను ప్రశ్నించగా.. అవును అంటూ ఆన్సర్ ఇచ్చింది లక్ష్మి. దాంతో లక్ష్మి చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మొన్న విష్ణు మరియు మనోజ్ ల మధ్య జరిగిన గొడవ కూడా వాస్తవమే అన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇద్దరి అన్నదమ్ముల జరుగుతున్న గొడవల మధ్య లక్ష్మి ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: