పుష్ప లో అనసూయ దాక్షాయిని పాత్ర కోసం ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా పుష్ప. టాలీవుడ్  ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షాన్ని కురిపించిన ఈ సినిమా .అల్లు అర్జున్ సినీ కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ను రాబట్టింది. ప్రస్తుతం పుష్ప టు సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇలాంటి ఒక ప్రతిష్టాత్మక సినిమా అయిన పుష్ప టు కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే పుష్ప సినిమాలో చాలా కొత్త డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు సుకుమార్. అలాంటి వారిలో దాక్షాయిని పాత్ర కూడా ఒకటి. ఇలాంటి ఒక పాత్రలో నటించి తనకంటూ మరింత గుర్తింపును పెంచుకుంది టాలీవుడ్ యాంకర్ అనసూయ. ఇక ఈ సినిమాలో నీ దాక్షాయని పాత్రలో ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ముఖ్యంగా మంగళం శ్రీను వైఫ్ గా అందరిని ఆకట్టుకుంది దాక్షాయిని. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పుష్పా సినిమాలోని ఈ పాత్ర కోసం మొదటగా అనుకున్నది యాంకర్ అనసూయని కాదట. ముందుగా ఈ పాత్ర కోసం యాంకర్ శ్యామలను అనుకున్నాడుట సుకుమార్. అనంతరం శ్యామల కంటే ఈ పాత్రలో అనసూయ అయితే మరింత బావుంటుంది అన్న ఉద్దేశంతో సుకుమార్ అనసూయని ఫైనల్ చేశారట. సినిమాలోని ఆ బోల్డ్ స్కిల్స్ అనసూయలో ఎక్కువగా ఉంటాయని అంతే కాదు సునీల్ పక్కన యాంకర్ శ్యామల భార్యగా సెట్ అవుతుందో కాదో అన్న ఉద్దేశంతో దాక్షాయిని పాత్ర కోసం అనసూయని తీసుకున్నాడు సుకుమార్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: