వాటి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా రిలీజ్ ఏడాది కాలంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి షెడ్యూల్ సైతం ప్రకటించారు. అయితే జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టనన్నాడట. అన్నవరం నుండి భీమవరం వరకు పవన్ కళ్యాణ్ తొలి విడత యాత్రలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులపాటు పొలిటికల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారట. 

మొదటగా అన్నవరంలో వారాహి పూజలను నిర్వహించి కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారట. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా షూటింగ్లకు బ్రేక్ ఇవ్వనున్నరని వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ సినిమా బ్రో వచ్చేనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదయ సీతం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సాధిస్తారని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల నుండి 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ను తీసుకున్నారు

అంటూ వార్తలు సైతం వచ్చాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎక్కువ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తంలో కూడా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట నిర్మాతలు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రీమేక్ సినిమాలో నటిస్తూనే మరోవైపు స్ప్రైట్ సినిమాలోని నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.తాజా సమాచారం మేరకు గాజువాక లేదా భీమవరం లేదా పిఠాపురం నుండి పవన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: