ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టు నుండి విడుదల చేసిన టీజర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే ఈ సినిమా మొదట్లోనే సాలిడ్ బస్ క్రియేట్ చేశాడు ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో పుష్పటు సినిమాని ఊహించని రేంజ్ లో భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాకి మించేలా తీయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు సుకుమార్. ఇక పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే డైలాగ్ ఎంతటి సంచలనాన్నే సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఈ డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది .అదే డైలాగ్ పుష్ప టు లో సైతం పాటిస్తున్నాడు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే ఇక తాజాగా పుష్పటు సినిమాపై జానీ మాస్టర్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలను చేశారు .దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..అందులో మాట్లాడుతూ.. సుకుమార్ టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక ఈ సినిమాలో హీరో మన అల్లు అర్జున్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. దేవిశ్రీప్రసాద్ రెండవ భాగానికి కూడా సాలిడ్ మ్యూజిక్ ని ఇస్తున్నాడు ..అయితే కొన్ని రోజుల ముందు నాకు అల్లు అర్జున్ గారు కాల్ చేశారు..
నాకు ఫోన్ చేసి మనం పుష్ప టు కోసం వర్క్ చేయాలి.. ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా చేయాలని అనుకుంటున్నా.. అంటూ నాతో చెప్పారు.ఆయన నాకు ఫోన్ చేసి ఇలా చెప్పగానే నేను షాక్ అయ్యాను .అయితే ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ గారు పుష్పటు సినిమా కోసం ఎంత డెడికేటెడ్ గా ఉన్నారో.. కేవలం బన్నీ డాన్స్ పైనే ఇంత ఫోకస్ పెట్టారు.. అంటే యాక్షన్ సీన్స్ ఇతర కీలక సన్నివేశాల కోసం బన్నీ ఏ రేంజ్ లో చేస్తున్నారో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. అంటూ చెప్పుకొచ్చాడు .దీంతో జానీ మాస్టర్ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన ఈ మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!