'ఆదిపురుష్' నుండి ట్రైలర్ 2 లోడింగ్.. ఫ్యాన్స్ రెడీనా..?

Anilkumar
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా 'ఆదిపురుష్' మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరో రెండు వారాల్లో ఆదిపురుష్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యద్భుతమైన విజువల్స్ తో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో ఈ సినిమా రూపొందించబడింది. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మొదట విడుదలైన టీజర్ సినిమాపై నెగెటివిటీని సొంతం చేసుకున్నా.. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈమధ్య ఈ సినిమా నుంచి  జైశ్రీరామ్ అంటూ సాగే ఓ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి కూడా ట్రెమండ్రస్ రెస్పాన్స్ వచ్చింది. అలా మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ స్పీడ్ ని పెంచేసింది. దీంతో ఆదిపురుష్ పై ఉన్న నెగెటివిటీ అంతా తొలగిపోయి సినిమాపై ఓరేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీకి భారీ బిజినెస్ కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ఈ మూవీ ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ కలెక్షన్స్ ని మరింత పెంచడానికి ట్రైలర్ 2 ని సిద్ధం చేస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ నుంచి సుమారు 2 నిమిషాల 27 సెకెండ్స్ నిడివి తో మరో ట్రైలర్ ని కట్ చేశారట దర్శకుడు ఓం రౌత్. ఇక ఈ ట్రైలర్ ని జూన్ 6న తిరుపతిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెకండ్ ట్రైలర్ కనుక బయటికి వస్తే సినిమాపై ఉన్న అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయమని చెప్పొచ్చు. రెట్రో ఫైల్స్, టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: