రాంచరణ్ సినిమాకు బడ్జెట్ పెరిగిపోతుందా...?

murali krishna
రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఈ సినిమా దిల్ రాజు నిర్మాణం లో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
తమిళ లెజెండ్రీ దర్శకుడు శంకర్ దర్శకత్వం లో ఈ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల దాదాపు 6 నెలల పాటు ఆలస్యం అవుతోందని సమాచారం.ఈ సంవత్సరం లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి సినిమా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సినిమా ఆలస్యం అవ్వడం వల్ల దాదాపు పాతిక కోట్ల రూపాయల అదనపు భారం నిర్మాత పై పడబోతోందని సమాచారం.అంతే కాకుండా సినిమా బడ్జెట్ లో కూడా లెక్కలు తారు మారయ్యాయని తెలుస్తుంది.. దాంతో మరో పాతిక కోట్ల రూపాయలు దిల్ రాజు పై భారం పడబోతోంది అని సమాచారం.ఇదే నిజమైతే సినిమా కి మొదట అనుకున్న దానితో పోలిస్తే రూ. 50 కోట్లు అదనంగా బడ్జెట్ పెరగబోతుందని సమాచారం.. మరి సినిమా ఆ పెరిగిన బడ్జెట్ ని.. ఎంత వరకు మోయగలదు అనేది హాట్ టాపిక్ గా అయితే మారింది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా కాబట్టి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఆసక్తి కి తగ్గట్లుగా సినిమానే రూపొందిస్తే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అదే నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమా కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం . అని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుందని మెగా ఫాన్స్ కూడా విశ్వసిస్తున్నారు. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తుంది.. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.తండ్రి పాత్ర కు గాను చరణ్ కి జోడిగా అంజలి హీరోయిన్ గా కనిపించబోతోందని తెలుస్తుంది.. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పటికే స్పష్టత వచ్చిందని కనుక షూటింగ్ ని అక్టోబర్ వరకు పూర్తి చేయాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: