సమంతని ఫాలో అవుతున్న నిహారిక..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొంతకాలంగా  నిహారిక తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. పెళ్లయిన తర్వాత నిత్యం కాంట్రవర్సీ లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిహారిక. అయితే తాజాగా ఈమె విడాకుల వార్తలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా నిహారిక తన భర్త జొన్నల గడ్డ చైతన్యను తన ఇంస్టాగ్రామ్ నుండి అన్ ఫాలో చేసింది. అంతేకాదు వారికి సంబంధించిన ప్రతి ఒక్క పెళ్లి ఫోటోలని మెమరీలని డిలీట్ చేసేసింది నిహారిక.

 దాంతో అప్పటినుండి ఈ వార్తలు రావడం మొదలయ్యాయి. అంతేకాదు ఎప్పుడైతే తన భర్తని ఇంస్టాగ్రామ్ నుండి అన్ ఫాలో చేసిందో అప్పటినుండి ఒంటరిగానే తిరుగుతోంది నిహారిక.అంతకు ముందు వరకు తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే నిహారిక చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన తర్వాత సింగిల్గానే తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది.అంతేకాకుండా ఇప్పుడు వెబ్ సిరీస్లను సైతం నిర్మిస్తోంది నిహారిక. అంతేకాదు ఒంటరిగానే విదేశాలకు కూడా టూర్స్ కి వెళుతుంది ఈమె. తాజాగా బాలి దేశానికి వెళ్ళింది నిహారిక.

అందులో భాగంగానే అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఆ ఫోటోని చూసిన నెటిజెన్స్ గతంలో సమంత చేసిన విధంగానే నువ్వు కూడా చేస్తున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే సమంత కూడా చైతన్యతో విడాకుల ప్రకటనకు ముందే ఫ్రెండ్స్ తో వెకేషన్ లోకి టూర్లకు వెళ్లి డిప్రెషన్ నుండి బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు నిహారిక సైతం ఇదే పని చేస్తుంది. అంటే నిహారిక కూడా సమంత లాగే త్వరలోనే విడాకులు ప్రకటన చేయబోతుందా అంటూ మరికొందరు నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: