హీరో శర్వానంద్ కు యాక్సిడెంట్...!!అస్సలు ఏం జరిగింది అంటే..!!

murali krishna
టాలీవుడ్ యంగ్ హీరో అయిన శర్వానంద్‌ కు శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.. ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పిందని సమాచారం.
ఈ ఘటనలో శర్వానంద్‌ కు స్వల్ప గాయాలు కాగా.. అక్కడున్న వారు హుటా హుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారటా.
విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి కి చేరుకుని శర్వానంద్ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసు కున్నారు. మరోవైపు ఘటనాస్థలం నుంచి కారు ను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారు ను కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారని తెలుస్తుంది.. రేంజ్ రోవర్ కారు కావడం వల్ల.. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల శర్వానంద్ కు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ఘటన గురించి మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది.
మరో వైపు.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్ వివాహం ఘనం గా జరగనుంద ని తెలుస్తుంది.తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకుంటున్నారని సమాచారం.రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోందని సమాచారం. జనవరి లో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్-రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లో ని లీలా ప్యాలెస్ ను ఎంచుకున్నారు. అక్కడ జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరగనుందని తెలుస్తుంది.. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ కూడా ఎంతో వైభవం గా ప్లాన్ చేసారని తెలుస్తుంది.ఇలాంటి సమయంలో శర్వానంద్ కు యాక్సిడెంట్ కావడం ఆయన కుటుంబం లో కలవరం రేపుతుంది. శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఆయన సినిమా షెడ్యూల్స్ వల్ల పెళ్లి కొద్దిగా ఆలస్యం అయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: