టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా రిలీజ్ మానియా నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా వరుసపెట్టి తమ పాత సినిమాలను మళ్లీ ఇప్పుడు రిలీజ్ చేస్తూ పోతున్నారు. అలాగే జనాలు కూడా ఆ సినిమాలని మళ్లీ చూడడానికి తెగ ఆసక్తి చెబుతున్నారు.హిట్ అయిన సినిమాలుని మళ్లీ హిట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరొక అడుగు ముందుకు వేశాడు ఎన్టీఆర్.ఆయన హీరోగా నటించిన సింహాద్రి సినిమాని మళ్లీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ టాలెంటెడ్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే.అలాగే ఎన్టీఆర్ కి కూడా విశ్వక్ సేన్ అంటే ఇష్టం. ఇక ఆయన హీరోగా నటించిన సినిమాల రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చాలాసార్లు గెస్ట్ గా వెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు విశ్వక్ వంతు వచ్చింది అని చెప్పాలి. సింహాద్రి రీరిలీజ్ ఈవెంట్ కు విశ్వక్సేన్ గెస్ట్ గా వస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది.ఇక సింహాద్రి సినిమాని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇకపోతే మే 17వ తేదీన హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఈవెంట్ కి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కి విశ్వక్సేన్ని ముఖ్య అతిథిగా పిలవడంతో విశ్వక్సేన్ ఎంతో ఆనందంగా ఉన్నాడట. ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక చావ్లా అంకితలు హీరోయిన్లుగా నటించారు. వారితోపాటు ముఖేష్ రిషి, నాజర్ ,రాహుల్దేవ్, బ్రహ్మానందం, శరత్ సక్సేన కీలకపాత్రను నటించారు. సింహాద్రి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రాజమౌళి కూడా వస్తారా లేదా అన్నది చూడాలి మరి...!!