డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో హీరో నిఖిల్ తో పాటు కలర్స్ స్వాతి హీరోయిన్గా నటించింది.ఇక ఈ సినిమాకి సీక్వెల్ 'కార్తికేయ 2' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊహించని స్థాయిలో సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ను రాబట్టింది.
ఇక ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని అప్పట్లో అల్లరి నరేష్ వదులుకున్నాడు అన్న వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ముందుగా కార్తికేయ సినిమాలో హీరోగా నటించే అవకాశం నిఖిల్ కి రాకముందే అల్లరి నరేష్ కి వచ్చిందని తాజాగా అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముందుగా కార్తికేయ సినిమాలో నటించే అవకాశం తనకే వచ్చిందని పేర్కొన్నాడు. డైరెక్టర్ చందు ఉండేటి ముందుగా ఈ కథని అల్లరి నరేష్ కి వినిపించారట .ఇక ఆ సినిమాని అల్లరి నరేష్ ఒక కారణంతో వదులుకున్నాను అంటూ స్వయంగా తానే తెలిపారు. ఇక ఈ సినిమా చేయకపోవడానికి ఆ ఒక్క కారణం ఏంటి అంటే..
ఈ సినిమా సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నేపథ్యంలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో పాములు ప్రధానంగా ఉంటాయి ఆ సినిమాలో పాముల సన్నివేశాలు ఉండడంతో తాను ఈ సినిమా చేయలేదని స్వయంగా తానే తెలిపారు. 'తనకు పాములు అంటే చాలా భయమని అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు అంటూ వెల్లడించాడు అల్లరి నరేష్. ఒకవేళ సినిమాలలో కూడా భయంకరమైన పాముల సన్నివేశాలు వస్తే ఆ సినిమా కూడా చూడను' అంటూ వెల్లడించాడు నరేష్. అందుకే కార్తికేయ సినిమాని సైతం వదులుకున్నాను అంటూ తెలియజేశారు..!!