శర్వానంద్ పెళ్లి ఆలస్యానికి కారణం ఇదేనా..?

Divya
ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు.. ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరొక సినిమాలో నటిస్తున్నారు శర్వానంద్.ఇకపోతే బ్యాచిలర్స్ అందరూ వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు నిశ్చితార్థం చేసుకొని పెళ్ళి పీటలు ఎక్కుతుంటే శర్వానంద్ కూడా గత ఐదు నెలల క్రితం బెంగళూరుకు చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయి తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
సాధారణంగా ఎంగేజ్మెంట్ జరిగిన రెండు నెలలు లేదా మూడు నెలల్లోపే వివాహాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ వీరి ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు గడుస్తున్న ఇంకా పెళ్లిపై ఎటువంటి వార్తలు రాకపోవడంతో రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోని రక్షిత రెడ్డి,  శర్వానంద్ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు అని,  ఇక వారు పెళ్లి చేసుకోకుండానే మరో అఖిల్ జంటలాగా కాబోతున్నారు అంటూ రకరకాల రూమర్సు స్ప్రెడ్ చేశారు. అయితే తాజాగా ఈ రూమర్స్ పై శర్వానంద్ టీం స్పందించింది.
శర్వానంద్, రక్షిత రెడ్డిల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వలేదు అని త్వరలోనే వీరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని ప్రకటిస్తారు.. అప్పటివరకు ఈ రూమర్స్ క్రియేట్ చేయడం ఆపండి అంటూ తెలిపారు. అంతేకాదు శర్వానంద్ పెళ్లికి ముందే కమిట్ అయిన చిత్రాలను పూర్తిచేయడానికి పెళ్లిని వాయిదా వేశారు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా శర్వానంద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.. 40 రోజుల షెడ్యూల్ కూడా పూర్తి అయింది. ఇక త్వరలోనే ఆయన పెళ్లి డేట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: