తన పెళ్లిని ప్రభాస్ పెళ్లితో లింక్ పెట్టిన విశాల్..?

Anilkumar
తమిళ అగ్ర హీరో విశాల్ ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇక 'లాఠీ' అనే సినిమాతో  చివరగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విశాల్ కి ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక ప్రస్తుతం మార్క్ ఆంటోనీ, డిటెక్టివ్ 2 సినిమాలు చేస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో. అందులో మార్క్ ఆంటోనీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విశాల్ తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. విశాల్ పెళ్లి విషయంలో గతంలో అనేక రకాల వార్తలు వినిపించాయి. కోలీవుడ్ నటి వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడని..

త్వరలోనే ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు రావడం జరిగింది. కానీ ఆ వార్తలు ఆ వాస్తవమని ఇద్దరు కూడా తర్వాత క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత హైదరాబాద్ కి చెందిన అనీషా అనే అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కూడా న్యూస్ వచ్చింది. ఇక ప్రజెంట్ అయితే సినీనటి అభినయతో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీని గురించి విశాల్ ని అడిగితే అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పాడు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని అడిగితే..' పెళ్లి అనేది జోక్ కాదు. అది ఒక బాధ్యత. నాకు ప్రొఫెషనల్ గా ఇప్పుడు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.

మన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత డెడికేటెడ్ గా ఉంటామో పర్సనల్ లైఫ్ లో కూడా అంతే డెడికేటెడ్ గా ఉండాలి. మ్యారేజ్ లైఫ్ కి తగ్గట్టు ఇంకా నా మైండ్ సెట్ కాలేదు' అంటూ చెప్పాడు. ఇక ఫైనల్ గా పెళ్లి గురించి సరదాగా మాట్లాడుతూ..' ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా' అంటూ చెప్పడంతో ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఇక విశాల్ ప్రస్తుతం నటిస్తున్న 'మార్క్ ఆంటోనీ' సినిమా నుండి ఇటీవలే టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విశాల్ విభిన్న తరహా పాత్రలు పోషించాడు. అదిక్ రవి చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు SJ సూర్య, టాలీవుడ్ కమెడియన్ కం యాక్టర్ సునీల్ కీలక పాత్రలు పోషించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: