మరోసారి పొలీస్ రోల్ లో అదరగొట్టనున్న గోపిచంద్..?

Anilkumar
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు. గోపీచంద్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. వరుస ప్లాపులు వచ్చినా టాలీవుడ్ లోని మోస్ట్ అండర్ రేటెడ్ హీరోస్ లిస్టులో గోపీచంద్ కూడా ఉంటాడు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే కథ కుదిరితే కచ్చితంగా ఆ మూవీ హిట్ అవ్వడం గ్యారెంటీ. దర్శకుడు ఓ కథ రాసుకున్నప్పుడు హీరోకున్న బలాలు ఆ కథకు సూట్ అవ్వాలి. అప్పుడే అది సినిమాకి ప్లస్ అవుతుంది. అలా ఈమధ్య గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ ఇంకాస్త సెట్ చేసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదేమో. 

ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'రామబాణం' మూవీ అయితే అవుట్ డేటెడ్ సినిమా అవడంతో డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు గోపీచంద్ కి ఓ హిట్ కావాలి. లేకపోతే ఫ్యాన్స్, ఆడియన్స్ ఆయన సినిమాల్ని పట్టించుకోవడం మానేసి పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలోనే తనకు కలిసి వచ్చిన పోలీస్ పాత్రలో మరోసారి సందడి చేయబోతున్నాడట ఈ హీరో. గోపీచంద్ కి పోలీస్ పాత్రలు బాగా సెట్ అవుతాయి. ముఖ్యంగా గోలీమార్ సినిమాలో గోపీచంద్ పోలీస్ గా చాలా బాగా నటించాడు. సినిమాలో గంగారం పాత్ర అతని బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సెట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాని ఎంజాయ్ చేసే ఆడియన్స్ చాలామంది ఉన్నారు.

అయితే మళ్లీ చాలాకాలం తర్వాత ఇప్పుడు మరోసారి పోలీస్ అవతారం ఎత్తబోతున్నాడు గోపీచంద్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ తో 'వేద' అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ హర్ష ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలోనే గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక రామబాణం రిజల్ట్ తర్వాత గోపీచంద్ కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. అందుకే తన కొత్త సినిమా షూటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: