బంపర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త మీనన్.. ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ హీరోయిన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా సంయుక్త మీనన్ పేరు చెబుతున్నారు అని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో రాణించాలి అంటే... వరుసగా అవకాశాలు అందుకోవాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే సంయుక్త మీనన్ కి మాత్రం ఆవగింజంత కాదు గుమ్మడికాయ అదృష్టం ఉందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్టార్ హీరో సినిమాలో చిన్న పాత్రలో నటించి ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి వరసగా విజయాలు అందుకుంటుంది.

 మొన్నటికి మొన్న అటు తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన సార్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న సంయుక్త మీనన్.. ఇటీవలే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన విరుపాక్ష సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే  అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. దీంతో డైరెక్టర్లు సైతం ఇక తమ సినిమాల్లో సంయుక్తనే  పెట్టుకోవడానికి తెగ ఆసక్తి చూపుతూ ఉన్నారు.  అయితే ఈ అందమైన హీరోయిన్ ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ అందుకున్నట్లు అటు ఇండస్ట్రీలో గాసిప్స్ తెరమీదకి వచ్చాయి.

 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందట. అయితే ఇప్పటికే ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది. చివరగా వీరి కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్మరోసారి రిపీట్ కాబోతుంది. అయితే ఇక ఈ సినిమాలో సంయుక్తా మేనన్ ఆఫర్ కొట్టేసిందట. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇది సంయుక్త మీనన్ కు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: