పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతకత్తకు ఆలస్యం అవుతూనే వస్తుంది.దీంతో ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయం అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది .
అయితే ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సినిమాల షూటింగ్ అన్నీ కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మాత్రం 40 రోజుల బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికల తర్వాతే ఈ సినిమా ని విడుదల చేయాలన్న ప్లానింగ్ లో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం అవుతున్న క్రమంలో కృష్ణ తర్వాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడట. ఇక అప్పట్లో క్రిస్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ మొత్తంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రానుంది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 2024 ఆఖరి వరకు ఏకంగా నాలుగు సినిమాలను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. కొన్ని నెలల గ్యాప్ లోనే పవన్ సినిమాలు విడుదల అవ్వబోతున్నాయట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కూడా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఇకపోతే వకీల్ సార్ విమల నాయక్ సినిమాలను ఎంతో వేగంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాని మాత్రం చాలా నిదానంగా షూట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది..!!