రాజమౌళి మూవీ కోసం మహేష్ అన్ని కోట్ల రెమ్యూనరేషన్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరీర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారి రూపొందిస్తున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమై కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు.



ఈ సినిమా మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే తదుపరి మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ ఉన్న సినిమా కోసం మహేష్ చాలా రోజులను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి మహేష్ 110 కోట్ల భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకోనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మహేష్ చాలా రోజుల కేటాయించనున్న నేపథ్యంలో ఈ రేంజ్ లో రెమినరేషన్ తీసుకోవడం సరైనదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: