ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మి, సంక్రాంతి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు శర్వానంద్. అనంతరం మొట్టమొదటిసారిగా గమ్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో కంటే మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమా తర్వాత హీరోగా పలు సినిమాలలో వరుస అవకాశాలు వచ్చాయి. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, ఒకే ఒక జీవితం, మహానుభావుడు వంటి సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్.
ఇకపోతే ఈ మధ్యనే శర్వానంద్ తాను ఎంతగానో ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా శర్వానంద్ పెళ్లి వార్తల్లో నిలుస్తున్నాడు. అయినప్పటికీ ఒక సారి కూడా శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ అయితే ఇవ్వలేదు. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు బయటకు రావడంతో శర్వానంద్ పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శర్వానంద్ జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పటివరకు మాత్రం పెళ్లి అయితే ఎప్పుడూ అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే తను పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నట్లుగా కూడా సమాచారం. దాంతోపాటు ఆయన కమిటైన సినిమాలు అందరికీ కూడా అనారోగ్య సమస్యల కారణంగా వాయిదా వేసినట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. శర్వానంద్ ఆరోగ్యం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన సినిమా షూటింగ్ లోకి వస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తను కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి పీటలు లేకపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నిజమైందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!