టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ పేరే వినబడుతుంది. ఎటువంటి జోనర్ సినిమా అయినా సరే తనదైన శైలిలో రెచ్చిపోతాడు బాలయ్య. దర్శకుడు ఎలా చేయమంటే అలా చేస్తూ ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగే సత్తా ఉన్న హీరో మన బాలకృష్ణ. సినిమా చూస్తున్నంత సేపు సినిమాలోకి కురుకు పోయేలా నటించగల సత్తా ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల అన్ స్టాపబుల్ అనే షో ద్వారా మంచి ఆదరణను పొందాడు బాలయ్య.
అంతేకాదు వేరే హీరోల అభిమానులను సైతం ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఇక సినీ ఇండస్ట్రీలో బోయపాటి మరియు బాలయ్య సినిమా కాంబినేషన్ కి ఎంతటి మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సింహ అఖండ వంటి మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ సినీ కెరియర్ లోనే ఈ సినిమాలో రికార్డు ఇస్తాయి కలెక్షన్లను రాబట్టాయి. అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా కూడా రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. త్వరలోనే అఖండ టు సినిమా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే 2021 లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్ లోనే మొదటగా 100 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలిచింది. దాంతోపాటు బాలయ్య సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా అత్యధిక వస్తువులను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో అఖండ టు సినిమా కూడా వస్తుందని తెలిసిన నందమూరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా మా సినిమాగా రూపుదిద్దుకోబోతోందన్న సమాచారం సైతం వినపడుతోంది..!!