నందమూరి బాలకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వారసుడు మోక్షజ్ఞ సిని ఎంట్రీ ఎప్పుడు అని నందమూరి అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా మోక్షజ్ఞ సిని ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దాంతోపాటు నందమూరి వారసుడు ఏ దర్శకుడుతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అని కూడా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బోయపాటి శ్రీను త్వరలోనే మోక్షజ్ఞను బిగ్ స్క్రీన్ కు పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అనంతరం బోయపాటి బాలకృష్ణతో మరో సినిమా తీయబోతున్నాడు. ఇకపోతే ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మోక్షజ్ఞ అతిధి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక అలా మోక్షజ్ఞ అతిథి పాత్ర ఈ సినిమాకి చాలా హైలైట్ గా నిలుస్తుంది అని కూడా అంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ వార్త నిజమే అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇక ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే గతంలో బాలకృష్ణ ఒక సందర్భంలో మాట్లాడుతూ మోక్షజ్ఞ సినిమాల్లోకి ఖచ్చితంగా వస్తాడని తెలియజేసాడు. ఇక అప్పటినుండి మోక్షజ్ఞ ఏ సినిమాలో కనిపిస్తాడు అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు తండ్రి కొడుకులు ఓకే సినిమాలో కనిపిస్తారని తెలిసిన నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇదే వార్త వినిపిస్తుంది. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తోందని అంటున్నారు..!!