ఆ స్టార్ హీరో సినిమా పాటే.. పవన్ సినిమా టైటిలట తెలుసా?

frame ఆ స్టార్ హీరో సినిమా పాటే.. పవన్ సినిమా టైటిలట తెలుసా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానుల సంఖ్యను అంతకంతపు పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఇప్పుడు ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.



 కోలీవుడ్ హిట్ మూవీ అయిన వినోదయ సీతం సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాకు పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తూ ఉండగా.. విలక్షణ నటుడు సముద్రకిని దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందో అనే విషయంపై కూడా ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తున్నాయ్.


 అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసారు అంటూ గతంలో వార్తలు వినిపించాయ్. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు ఊహించని టైటిల్ ఫిక్స్ అయిందట. దేవుడే దిగివచ్చిన అనే ఒక పాటనే.. ఈ సినిమాకు టైటిల్ గా పెట్టారట. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్  రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. నాగార్జున నటించిన సంతోషం మూవీ లో ఇదే లిరిక్ తో ఒక పాట ఉంది. ఇకఇప్పుడు ఈ పాటనే పవన్ సినిమాకు టైటిల్ గా పెట్టడంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు.. అయితే మరికొన్ని రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: