శ్రీముఖి ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బుల్లితెర యాంకర్ శ్రీముఖి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మొదట యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె దాని అనంతరం పలు సినిమాల్లో సైతం నటించింది.జులై, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, నేను శైలజ, జెంటిల్మెన్ వంటి పలు సినిమాలలో నటించింది శ్రీముఖి. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ వెండితెరపై తను అనుకున్నంత సక్సెస్ను సాధించలేకపోయింది శ్రీముఖి. దాంతో యాంకర్ గా బుల్లితెరపైనే సెటిల్ అయ్యింది. తన ఎనర్జిటిక్ మాటలు పంచులతో పాటు గ్లామర్ షో తో కూడా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

 రియాలిటీ షో అయిన బిగ్ బాస్ వంటి షోలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి.అనంతరం బ్యాక్ టు బ్యాక్ టీవీ షో లతో మరింత బిజీగా మారింది. యాంకరింగ్ తో పాటు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సినిమాల్లో సైతం మెరుస్తూ తన సత్తా చూపెడుతోంది. అయితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. తన అందాల ఆరబోతులో ఎలాంటి హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తోంది శ్రీముఖి. ఇదిలా ఉంటే శ్రీముఖి ఒకరోజు సంపాదన ఎంత అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

అయితే బుల్లితెరపై ఇప్పటివరకు ఉన్న యాంకర్లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. సాధారణంగా శ్రీముఖి ఏదైనా ఈవెంట్ లేదా ఒకరోజు షూటింగ్ చేసినట్టే ఖచ్చితంగా దాదాపుగా 3 లక్షలకు పైగానే తీసుకుంటుందట.అంతేకాదు శ్రీముఖి సంపాదన ముందు హీరోయిన్లు సైతం పనికిరారు అన్న కామెంట్లు సైతం వినపడుతున్నాయి. సుమ తర్వాత యాంకర్ గా శ్రీముఖికి ఉన్న క్రేజ్ మరో యాంకర్ కి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీముఖికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత పారితోషకాన్ని ఇవ్వడానికి ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. దీంతో శ్రీముఖి ఒక రోజుకు తీసుకునే రెమ్యూనిరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: