అబ్బురపరిచే విధంగా జ్యోతిక ఫిట్నెస్ వీడియో..!!

Divya

హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది తమిళ హీరోయిన్ జ్యోతిక. ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక జ్యోతిక హీరోను సూర్యను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే ఈ మధ్యనే పలు చిత్రాలలో నటిస్తూ రీఎంట్రీ కూడా ఇచ్చింది జ్యోతిక చాలా గ్యాప్ తర్వాత కం బ్యాక్ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది అందుకే ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించేందుకు మక్కువ చూపుతోంది. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ కథలను ఎంపిక చేసుకోని సినిమాలు చేస్తున్న జ్యోతిక బాగానే సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.

ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయం పైన పలు జాగ్రత్తలు తీసుకోవడానికి పలు సన్న హాలు చేస్తూనే ఉంది. జ్యోతిక వయస్సు ప్రస్తుతం 44 సంవత్సరాలు అన్నట్లుగా సమాచారం .సాధారణంగా ఈ వయసులో హీరోయిన్స్ గా ఆఫర్లు రావడం అనేది చాలా తక్కువ అని చెప్పవచ్చు.. సౌత్ లో ఈ వయసు వచ్చేసరికి హీరోయిన్గా కంటిన్యూ అవ్వడం దాదాపుగా అసాధ్యమని కూడా చెప్పవచ్చు. కానీ జ్యోతిక మాత్రం ఇంకా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హీరోయిన్గా కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న చంద్రముఖి-2 చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తన సినిమాల కోసం జ్యోతిక వర్కౌట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా సింగిల్ హ్యాండ్ పై బ్యాలెన్స్ చేయడంతో పాటు హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిట్నెస్తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోని చూసిన అభిమానుల సైతం బాబోయ్ ఇలాంటి అబ్బురపరిచే ఫిట్నెస్ ఇంతవరకు మేము చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత కష్టం ఏ సినిమా కోసం అంటూ కూడా పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తూ ఉంటే.. మీరు ఈ స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి కొత్త హీరోయిన్స్ ఫిజిక్ విషయంలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి జ్యోతిక వర్కౌట్ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: