'బిగ్ బాస్ -7' కి ఉదయ భాను అతనితో కలిసి వెళ్తోందా..?

Anilkumar
ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా భారీ క్రేజ్ దక్కించుకుంది ఉదయభాను. అప్పట్లో ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా కూడా అందులో ఉదయభాను యాంకరింగ్ ఉండాల్సిందే. ఏ టీవీ షోలో అయినా ఆమె సందడి చేయాల్సిందే అన్నట్లుగా ఆమె క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని టీవీ చానల్స్ కు ఫస్ట్ ఆప్షన్ గా ఉదయభాను ఉండేది. తన అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది ఉదయభాను. ఇక కొన్నాళ్లకు పెళ్లి చేసుకొని ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా బుల్లితెరకి దూరంగా ఉంటుంది ఉదయభాను. రీసెంట్ గానే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇటీవల ఓ షో కి యాంకర్ గా చేసింది. 

ఇన్ని రోజులు తన అభిమానులకు దూరంగా ఉన్న ఉదయభాను.. ఇటీవల సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించి ప్రతి విషయాన్ని వ్లాగ్స్ రూపంలో చేస్తోంది. ఇక మళ్లీ బుల్లితెరపై ఫేమ్ కోసం పరితపిస్తున్న ఉదయభాను.. తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తను మాత్రమే కాదు బిగ్బాస్ సీజన్ -7 లో తన భర్తతో కలిసి జోడిగా వెళుతుందట ఉదయభాను. మన బిగ్ బాస్ హౌస్ లో కపుల్స్ వెళ్లడం కొత్తేమి కాదు. ప్రతి సీజన్లో ఓ జోడి కచ్చితంగా ఉంటుంది. అలా బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ అతని భార్య వితిక బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బిగ్బాస్ 6 లో మెరీనా, రోహిత్ లు కూడా జోడిగా వచ్చి మెప్పించారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ -7 లో వెళ్లే జోడీలలో ముఖ్యంగా రెండు జంటల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అమరదీప్-తేజస్విని జంట కాగా.. మరొకటి ఉదయభాను - అజయ్ అని తెలుస్తోంది. ఇక అమరదీప్, తేజస్విని రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుల్లి తెర నటీనటులంతా అటెండ్ అయ్యారు. దాంతో బుల్లితెరపై ఈ జోడి కి మంచి క్రేజ్ ఉంది. ఇక మరోవైపు ఉదయభాను తన భర్తతో కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఈ షో తో ఉదయభానుకు మళ్ళీ క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయభాను బిగ్ బాస్ సీజన్ -7 లో ఎంట్రీ ఇస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: