'శాకుంతలం' రిజల్ట్ పై ఓఎన్ అయిన దిల్ రాజు.. నా 25 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఊహించలేదంటూ..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న  దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిన్న సినిమాలతో పాటు బడా ప్రాజెక్ట్స్ ని సైతం నిర్మిస్తూ ముందుకెళ్తున్నాడు ఈ నిర్మాత. ఇక ఇప్పటివరకు ఈయన నిర్మించిన సినిమాల్లో సక్సెస్ అందుకున్న సినిమాలే ఎక్కువ ఉండడం విశేషం. ఒకవేళ అప్పుడప్పుడు ప్లాప్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల బలగం అనే ఓ చిన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

ఇక బలగం హిట్ తర్వాత దిల్ రాజు నిర్మాణం వహించిన 'శాకుంతలం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనా నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ని మూట గట్టుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే కనీసం 10 కోట్ల కలెక్షన్స్ సైతం అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు శాకుంతలం గురించి దిల్ రాజు చాలా గొప్పగా చెప్పడంతో మూవీ రిజల్ట్ తర్వాత అతనిపై ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే శాకుంతలం రిజల్ట్ పై తాజాగా ఓపెన్ అయ్యాడు దిల్ రాజు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' శాకుంతలం మూవీ మిస్ ఫైర్ అయిందని.. సోమ, మంగళవారాల్లో కలెక్షన్స్ రాలేదంటే అప్పుడే ఫిక్స్ అయిపోవాలని.. రియలైజేషన్ కావాలని అన్నారు. శాకుంతలం తనకు పెద్ద ఝలక్ ఇచ్చిందని, తన 25 ఏళ్ల కెరీర్ లో ఇది ఎప్పుడూ ఊహించలేదని దిల్ రాజు చెప్పాడు. ఇటీవల కాలంలో మంచి హిట్స్ అందుకున్న దిల్ రాజుకి శాకుంతలం సినిమా వల్ల భారీ నిరాశ మిగిలిందనే చెప్పాలి. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. ప్రకాష్ రాజ్ మోహన్ బాబు, మలయాళ నటుడు దేవ్ మోహన్,అల్లు అర్హ, మధుబాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ విడుదలై  డిజాస్టర్ గా నిలిచి దిల్ రాజుకి భారీ నష్టాలను మిగిల్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: