డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో తనకి పెద్దగా సీన్లు పడకపోయినప్పటికీ స్క్రీన్ స్పేస్ పెద్దగా దక్కక పోయినప్పటికీ.. తన నటనతో.. తన సిగ్గుతో ఉన్నంతసేపు అందరినీ ఆకట్టుకుంది సౌదామని. ఆకట్టుకోవడంతోపాటు తను ఆ సీన్లలో ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే ఉండేలా నటించింది ఆమె.
ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎవరు ఊహించని ఆఫర్ను కొట్టేసింది ఈమె. అయితే ఏకంగా సౌధామిని ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో రోల్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. తనకి సినిమాల్లో నటించాలనే కోరికతో టాలీవుడ్ లో ఆర్టిస్ట్ గా రాణించాలి అని తనకి ఉన్న పట్టుదలే ఇందుకు కారణమని చెప్పొచ్చు.ఎప్పటినుండో సినిమాల్లో నటించాలి అని ఎంతో ఆశతో ఉన్న సౌధామని బలగం సినిమాలో తనకి వచ్చిన ఆ చిన్న అవకాశాన్ని ఎంతో బాగా వినియోగించుకుంది అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో సౌధమని చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో ఎంతో సిగ్గుతో..
అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. అంతేకాకుండా బలగం సినిమాలో ఆ క్యారెక్టర్ కోసం 10 కిలోలు వెయిట్ పెరగాలని డైరెక్టర్ చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా 10 కిలోల వెయిట్ కూడా పెరిగింది. బలగం సినిమాలలో తనకి వచ్చింది చిన్న రోల్ అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా 10 కిలోల బరువు పెరిగి మనసుపెట్టి మరి ఆ క్యారెక్టర్ లో కూరుకుపోయింది సౌదామని. ఇందుకు ఫలితంగా తాజాగా సౌధామని జాతి రత్నాలు. డైరెక్టర్ నుండి నేరుగా ఒక బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. దీంతో బలగం సౌదామనికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!