అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్ సురేందర్ 2 బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ కు అనుకున్న రేంజ్ లో మాత్రం రెస్పాన్స్ రాలేదు.
దీంతో రకరకాలుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు చిత్ర బృందం.ఇక ఆ వేడుకలకి నాగార్జున ముఖ్య అతిథిగా కూడా విచ్చేశారు. ఈ క్రమంలోనే నాగర్జున టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో మరో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ లో మరో ఫ్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఇక ఆ వేడుకకు ముఖ్య అతిథులుగా నాగార్జునతో పాటు మమ్ముట్టి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఆ వేడుకకు అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అఖిల్ హీరోగా నటించిన అఖిల్ సినిమాకి కూడా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వెళ్లడం వల్ల బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో సైతం అఖిల్ పేరు మారుమోగింది.అఖిల్ సినిమాకు వచ్చిన మాదిరిగానే ఈ సినిమాకి కూడా అతిథిగా మహేష్ బాబు వస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. నిజంగా ఈ కార్యక్రమానికి మహేష్ బాబు వస్తాడా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియదు..!!